News May 9, 2024
రికార్డు సృష్టించిన ‘హీరామండీ’

భారీ తారాగణంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండీ’. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది వీక్షించిన ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. 43 దేశాల్లో టాప్-10లో ట్రెండింగ్‌లో ఉంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ ముఖ్య పాత్రల్లో నటించిన ‘హీరామండీ’ మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Similar News
News January 26, 2026
ఎక్కువ వెల గొడ్డును, తక్కువ వెల గుడ్డను కొనరాదు

ఎక్కువ ధర పెట్టి పశువును కొన్నప్పుడు, అది అనుకోకుండా మరణిస్తే యజమానికి భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే మరీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని బట్టలు కొంటే అవి చిరిగిపోయి, రంగు వెలిసి, ముడుచుకుపోతాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో ముడిపడి ఉన్న ప్రమాదం, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి. అనవసర ఆడంబరానికి పోయి ఎక్కువ వెల పెట్టకూడదు, అతి తక్కువ ధరకు ఆశపడి నాణ్యత లేని వస్తువును తీసుకోకూడదు.
News January 26, 2026
నేడు వీటిని దానం చేస్తే..

ఈరోజు దానధర్మాలు చేస్తే అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. నేడు బియ్యం, పప్పులు, కూరగాయలు దానం చేయాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం శ్రేష్ఠం. ఆవులకు పశుగ్రాసం తినిపించి, వైష్ణవాలయాలను సందర్శించాలి. ఇలా భక్తితో దానాలు చేసి ఉపవాసం ఉంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని, గ్రహ దోషాలు నశించి వంశాభివృద్ధి, మనశ్శాంతి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ చిన్న సాయం జీవితంలో పెద్ద మార్పును తెస్తుంది.
News January 26, 2026
నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.


