News May 9, 2024

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

image

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’ పేరుతో గూగుల్ ఓ డిజిటల్ వాలెట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో మీ పేమెంట్ కార్డులు, టికెట్లు, ఐడీలు మొదలైనవి భద్రపరుచుకోవచ్చు. అయితే ఇందులో గూగుల్ పే తరహాలో చెల్లింపులు చేసే సదుపాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా హైదరాబాద్, కొచ్చి మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Similar News

News January 8, 2025

చాహల్ భార్యతో సన్నిహిత ఫొటో: స్పందించిన కొరియోగ్రాఫర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News January 8, 2025

టెస్టుల్లో మళ్లీ విరాట్ కెప్టెన్ కావొచ్చు: గిల్‌క్రిస్ట్

image

విరాట్ కోహ్లీ మరోసారి ఇండియా టెస్టు జట్టు పగ్గాలు చేపట్టొచ్చని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అన్నారు. ‘రోహిత్ ఇంటికి చేరాక టెస్టు భవిష్యత్తును సమీక్షించుకుంటారు. ఆయన ఇంగ్లండ్‌ టెస్టులకు వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడొచ్చేమో. ఆ తర్వాత రిటైరవ్వొచ్చు. బుమ్రా ఎంత ఫిట్‌గా ఉన్నారన్నది అనుమానమే. నాకు తెలిసి భారత్ మళ్లీ విరాట్‌నే కెప్టెన్‌గా నియమించొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

News January 8, 2025

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తాం: మోదీ

image

AP: విశాఖ సముద్ర తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్థానిక ఫిషింగ్ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్రిస్ సిటీ(కృష్ణపట్నం) భాగం అవుతుందని వెల్లడించారు.