News May 9, 2024

600 మార్కులకు 572 వచ్చినా సూసైడ్.. కారణమేంటంటే?

image

యూపీలో పది ఫలితాల్లో స్కూల్ టాపర్ కంటే 3 మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో పాండేపూర్‌కు చెందిన సాక్షికి 600 మార్కులకు 572 వచ్చాయి. స్కూల్ టాపర్‌కు 575 మార్కులు వచ్చాయి. టాపర్ కాలేదని మనస్తాపంతో సాక్షి సోమవారం రాత్రి 9 గంటలకు ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Similar News

News February 4, 2026

అదే రోజున ఓటీటీలోకి MSVPG ఏడు భాషల్లో రిలీజ్!

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం త్వరలో OTTలో సందడి చేయనుంది. ఇప్పటికే OTT సంస్థ జీ5 దీనిపై అనౌన్స్‌మెంట్ ఇచ్చినా డేట్ కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు.

News February 4, 2026

అసభ్యకరంగా కామెంట్స్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

image

సోషల్ మీడియాలో తనపై అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తనను వేధిస్తున్నాడని ఆమె అతడి ఐడీతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ వేధింపులపై ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు సమర్థిస్తున్నారు.

News February 4, 2026

ఐఐటీ గోవాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఐఐటీ <<>>గోవా 5 నాన్ టీచింగ్(అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, బీఎస్సీ(కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్), BE/BTech, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitgoa.ac.in