News May 9, 2024

RCBvsPBKS.. రేసులో నిలిచేదెవరో?

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా ఇరు జట్లూ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లు కలిగి ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. నేడు గెలిచిన టీమ్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 32 మ్యాచ్‌లు జరగ్గా పంజాబ్ 17, బెంగళూరు 15 గెలిచింది.

Similar News

News January 8, 2025

టెస్టుల్లో మళ్లీ విరాట్ కెప్టెన్ కావొచ్చు: గిల్‌క్రిస్ట్

image

విరాట్ కోహ్లీ మరోసారి ఇండియా టెస్టు జట్టు పగ్గాలు చేపట్టొచ్చని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గిల్‌క్రిస్ట్ అన్నారు. ‘రోహిత్ ఇంటికి చేరాక టెస్టు భవిష్యత్తును సమీక్షించుకుంటారు. ఆయన ఇంగ్లండ్‌ టెస్టులకు వెళ్తారని నేను అనుకోవడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడొచ్చేమో. ఆ తర్వాత రిటైరవ్వొచ్చు. బుమ్రా ఎంత ఫిట్‌గా ఉన్నారన్నది అనుమానమే. నాకు తెలిసి భారత్ మళ్లీ విరాట్‌నే కెప్టెన్‌గా నియమించొచ్చు’ అని వ్యాఖ్యానించారు.

News January 8, 2025

విశాఖ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తాం: మోదీ

image

AP: విశాఖ సముద్ర తీరం వందల ఏళ్లుగా ఎగుమతులు, దిగుమతుల్లో ప్రధాన పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. స్థానిక ఫిషింగ్ హార్బర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సముద్ర సంబంధిత అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకుంటామని, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. అటు చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో క్రిస్ సిటీ(కృష్ణపట్నం) భాగం అవుతుందని వెల్లడించారు.

News January 8, 2025

విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవు: సీఎం చంద్రబాబు

image

రాష్ట్రంలో విధ్వంస పాలకులతో లక్ష్యాలు నెరవేరవని సీఎం చంద్రబాబు వైజాగ్ సభలో అన్నారు. ‘ప్రజలు మద్దతునిస్తే ఎలాంటి సుపరిపాలన సాధ్యమో ప్రధాని మోదీ ఇప్పటికే నిరూపించారు. ప్రజల్లో చైతన్యం రావాలి. 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుంది. భారతీయులు అన్ని రంగాల్లోనూ నంబర్ వన్ స్థానంలో ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉండటం దేశానికి కలిసొస్తోంది. మోదీ ఇప్పుడు గ్లోబల్ లీడర్’ అని పేర్కొన్నారు.