News March 31, 2026

అధికారులను సమాయత్తం చేశాం: కలెక్టర్

image

గ్రామ వార్డు సభల నిర్వహణకు సంబంధించి అధికారులను సమాయత్తం చేశామని NZBజిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ఉ.7.30 గంటల నుంచి 10.30 గంటల లోపు సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులను సమాయత్తం చేశామన్నారు. అన్ని వర్గాల ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేస్తూ జిల్లాలో గ్రామ, వార్డు సభలను విజయవంతం చేస్తామని అన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.