News May 9, 2024
ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం రూ.8.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News January 8, 2025
ఈ ప్రాజెక్టులతో సరికొత్త శిఖరాలకు ఏపీ: మోదీ
APలో ఇవాళ తాము శ్రీకారం చుట్టిన రూ.2.10లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రాన్ని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయన్నారు. IT, టెక్నాలజీకి AP ప్రధాన కేంద్రం కానుందని చెప్పారు. విశాఖకు కేటాయించిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎంతో మందికి ఉపాధి ఇస్తుందని, 3 రాష్ట్రాల్లోనే వస్తున్న బల్క్ డ్రగ్ పార్కును విశాఖ(నక్కపల్లి)కి కేటాయించామన్నారు.
News January 8, 2025
ఏసీబీ కార్యాలయంలో ముగిసిన అరవింద్ కుమార్ విచారణ
TG: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. అరవింద్‌ను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక కారణం, ఎవరి అనుమతితో బదిలీ చేశారు? నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేసుకున్నారు.
News January 8, 2025
ALERT.. ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపు ఉదయం నార్త్ HYDలో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ HYDలో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.