News May 9, 2024

స్టీల్ ప్లాంట్ రక్షణలో కలెక్టర్ జోక్యం చేసుకోవాలి: సీఎండీ

image

సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కోక్ ఓవెన్ బ్యాటరీల రక్షణ విషయంలో కలెక్టర్ మల్లికార్జున జోక్యం చేసుకోవాలని బుధవారం స్టీల్ ప్లాంట్ సీఎండీ భట్ విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ కు బొగ్గు రవాణా చేయాలని జారీ చేసిన హైకోర్టు ఆదేశాలు అమలుకు నోచుకోలేదన్నారు. గంగవరం పోర్ట్ యజమాన్యం బొగ్గు రవాణాకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అన్నారు. బొగ్గు అందుబాటులో లేక ఉత్పత్తి గణనీయంగా తగ్గిందన్నారు.

Similar News

News October 24, 2025

‘కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు భర్తీ కావాలి’

image

కేజీహెచ్‌లో 108 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు సూపరింటెండెంట్ ఐ.వాణిని గురువారం కోరారు. 34 హెడ్ నర్సులు, 43 కాంట్రాక్ట్ నర్సులు, ట్రామా కేర్‌లో 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సిబ్బంది పనిభారం అధికమై రోగుల సేవలో నాణ్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

News October 23, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News October 23, 2025

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: జేసీ

image

బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసి మయూర్ అశోక్ తెలిపారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. క్వాలిటీ, క్వాంటిటీల్లో రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నరా అని తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.