News April 1, 2026

చిత్తూరు జిల్లాలో 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

చిత్తూరు జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ సుమిత్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేడ్-3 ఏఎన్ఎం-20, ఆఫీస్ సబార్డినేట్-2, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-1 మొత్తంగా 23 పోస్టులను భర్తీ చేస్తారు. 18 ఏళ్లు నిండి 52 ఏళ్ల లోపు ఉన్న దివ్యాంగులు మాత్రమే అర్హులు. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తులను చిత్తూరు కలెక్టరేట్‌కు పంపించాలి. వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

Similar News

News April 6, 2026

CTR: జనసేనలో చేరిన నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు

image

వి.కోట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, నందమూరి అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ నాయుడు అలియాస్ బుల్లెట్ నాయుడు జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో ఇటీవల ఆ పార్టీ జెండా కప్పుకొన్నారు. యువ రాజకీయాలకు జనసేనాని సిద్ధాంతాలు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. భావితర రాజకీయానికి యువతను ప్రోత్సహించడంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు.

News April 6, 2026

P4, సంజీవినిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లండి : CM

image

P4, సంజీవిని కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, రాష్ట్ర అభివృద్ధికి ఈ కార్యక్రమాలు ఎంతో కీలకమని CM చంద్రబాబు TDP శ్రేణులకు సూచించారు. ఉండవల్లి నివాసంలో కుప్పం TDP నేతలతో CM చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు, గత ఐదేళ్ల పాలనపై ప్రజల తీర్పు మనకు ఒక ఉదాహరణగా తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. మీ ప్రవర్తన బాగుంటే ఆ ఇంపాక్ట్ తనపై ఉంటుందన్నారు.