News April 1, 2026

చిత్తూరు జిల్లాలో మర్డర్..!

image

చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పెద్దపంజాణి మండలం ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. ఈక్రమంలో రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారించగా సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు అతడిని విచారించగా హత్య చేసి జగమర్ల అడవిలో పారవేసినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

Similar News

News April 19, 2026

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ ఇయర్‌లో 12,567 మందికి 8,691 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 11,651 మందికి 8,280 మందే పాసయ్యారు, 3,371 మంది ఫెయిలయ్యారు. సెకండ్ ఇయర్‌కు సైతం ఇంఫ్రూమెంట్ రాసే అవకాశం ఉండటంతో ఫెయిల్ అయిన వారితోపాటు పాసైన వాళ్లు మరోసారి పరీక్ష రాయవచ్చు. మే 21 నుంచి జూన్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 27 లోపు ఫీజు చెల్లించాలి.

News April 19, 2026

చిత్తూరు: ఇనామ్ భూములకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు

image

ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేల ఎకరాలకు విముక్తి కలగనుంది. చిత్తూరులో 358.91, తిరుపతిలో 1950.34 అన్నమయ్య జిల్లాలో 3929.95 ఎకరాల చొప్పున ఇనామ్ భూములు ఉన్నాయి. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

News April 19, 2026

చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

image

వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా గంగవరం మండలం ఆరంజ్ జోన్‌లో కొనసాగుతోంది. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రంలో 38.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.