News April 1, 2026

వరంగల్: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

Similar News

News April 19, 2026

అధికారులు, మీడియా సంస్థలతో సమన్వయంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రభుత్వ శాఖల అధికారులు, మీడియా సంస్థల ప్రతినిధులతో సమన్వయంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా నియమితులైన బి.ప్రేమలత హనుమకొండ నక్కలగుట్టలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమాచార శాఖ ద్వారా మీడియాకు చేరవేయడంలో అనుసంధాన కర్తగా వ్యవహరిస్తుందని కలెక్టర్ అన్నారు.

News April 17, 2026

నేడు కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల నిరసన

image

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన చేపట్టనున్నట్లు వరంగల్ జిల్లా ఛైర్మన్ గజ్జల రామ్ కిషన్ తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరసనకు అనుమతి కోరుతూ అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ ఫణి కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

News April 16, 2026

గీసుగొండ: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

image

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలం కోనాయిమాకులం రైతు వేదికలో మండల స్థాయి సమావేశం జరిగింది. కలెక్టర్ డా. సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ముఖ్య అంశాలపై అధికారులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.