News May 9, 2024

ఒంగోలు: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు మరో ఛాన్స్

image

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు ఎన్నికల కమిషన్ మరో చాన్స్‌ ఇస్తూ, ఒక రోజు పొడిగించింది. తొలుత ప్రకటించిన ప్రకారం బుధవారంతో ఈ ప్రక్రియ ముగియాల్సి ఉంది. తాజాగా గురువారం కూడా ఓటింగ్‌కు అవకాశం కల్పించింది. జిల్లాలో 19,050 మంది అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి 17,003 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Similar News

News September 11, 2025

ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్‌గా రాజ బాబు

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజ బాబు నియమితులయ్యారు. ఏపీలోని పలు జిల్లాల కలెక్టర్‌లను బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన తమీమ్ అన్సారియా తన మార్కు పాలన సాగించారు. పలు సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో ఆమె తనదైన శైలిని ప్రదర్శించారు.

News September 11, 2025

ఒంగోలు: అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

image

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి 3 ఏళ్ల జైలుశిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. కొమరోలు మండలం మైనర్ బాలిక పట్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో పోలీసులు సరైన సాక్ష్యాలు సేకరించారు. తాజాగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించగా పోలీసులను SP దామోదర్ అభినందించారు.

News September 10, 2025

రేపు ప్రకాశం జిల్లాకు వర్ష సూచన

image

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రభావం ప్రకాశం జిల్లాపై సైతం పడుతుందని పేర్కొంది. దీంతో ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పశ్చిమ ప్రకాశంలో నేటి సాయంత్రం మోస్తరు వర్షాలు కురిశాయి.