News May 9, 2024

తూ.గో: ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని రాజమహేంద్రవరం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐసీహెచ్వీఎస్ నరసింహం బుధవారం తెలిపారు. అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు పదో తేదీ వరకు మాత్రమే గడువు ఉందన్నారు. తత్కాల్ స్కీంలో ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 5, 2024

ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. టీచర్ అరెస్ట్ 

image

ఐ.పోలవరం హైస్కూల్‌లో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ చేసిన ఫిర్యాదుపై మంగళవారం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై వార్డెన్‌ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై టీచర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యారు.

News November 5, 2024

మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన బీజేపీ నేతలు

image

డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమలాపురం వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

News November 5, 2024

రాజోలు: వృద్ధుడి హత్య.. బంగారం, నగదు చోరీ

image

రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో జగ్గారావు (93)ని హత్య చేసి ఇంట్లోని 22 గ్రాములు బంగారం, రూ.40 వేలు నగదు చోరీ చేశారని మృతుని మనవడు శ్రీకాంత్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని సీఐ నరేశ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన సందీప్ హత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతుడి ఇంట్లో దొంగతనం కేసులో సందీప్ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడని, ఆ కక్షతో వృద్ధుడిని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.