News April 1, 2026

జగిత్యాల: ‘తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా పనిచేయాలి’

image

సంక్షేమ హాస్టళ్లపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించేలా అధికారులు పనిచేయాలని, 60 రోజుల్లో హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు పనులు పూర్తి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం జగిత్యాల జిల్లా సంక్షేమ హాస్టల్స్ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నిర్వహిస్తున్న సంక్షేమ హాస్టలలో విద్యార్థులకు విద్యతోపాటు అన్ని సౌకర్యాలు కల్పనకు కృషి చేయాలని తెలిపారు.

Similar News

News April 5, 2026

రేపే JNTUలో పట్టాల పండగ

image

అనంతపురం JNTUలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో ఆదివారం వైస్ ఛాన్సలర్ హంచాటే సుదర్శన రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రేపు జరిగే 15వ స్నాతకోత్సవానికి సంబంధించి విశ్వవిద్యాలయ పరిధిలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమాచార్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలోని 40,780 మంది డిగ్రీ పట్టాలు, 45 మంది బంగారు పతకాలు, 70 మంది పీహెచ్‌డీలు అందుకోనున్నట్లు తెలిపారు.

News April 5, 2026

యూనివర్సిటీలో మావోయిస్టు భావజాలం: బండి సంజయ్‌కు విద్యార్థుల ఫిర్యాదు

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తూ, విద్యార్థులను మావోయిస్టు భావజాలం వైపు ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పరిశోధక విద్యార్థి నైతం మహేశ్ కేంద్రమంత్రి బండి సంజయ్‌కు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ సుజాత, విద్యార్థి కరికే మహేశ్‌పై గతంలోని అభియోగాలను పేర్కొంటూ, వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

News April 5, 2026

కోర్టు అన్ని వర్గాల ప్రజలకు పవిత్ర స్థలం: సీఎం రేవంత్

image

TG: కొత్త హైకోర్టు నిర్మాణాన్ని ప్రారంభించడం తమ ప్రభుత్వానికి ఓ గొప్ప అవకాశమని CM రేవంత్ చెప్పారు. అగ్రశ్రేణి న్యాయ మేధావులతో కలిసి ఉండటం తనకు లభించిన గౌరవమన్నారు. హైకోర్టు జోన్-2 శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కోర్టు సముదాయం నిర్మించడం అంటే అన్ని కులాలు, మతాల ప్రజలకు న్యాయం కోసం ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటుచేసినట్లే. ఈ భవనం మా ప్రభుత్వ ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబం’ అని పేర్కొన్నారు.