News May 9, 2024
ఫేక్ ఓటర్లపై క్రిమినల్ కేసు పెడతాం: అదితిసింగ్

తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా సంఘటనలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో తాజా ఎన్నికలపై తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి అదితిసింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఫేక్ ఓటరని గుర్తిస్తే.. సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Similar News
News October 24, 2025
చిత్తూరు జిల్లాలో 177 ఎకరాలలో దెబ్బతిన్న వరి పంట

వర్షాల కారణంగా జిల్లాలో 177 ఎకరాల్లోని వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖాధికారులు తెలిపారు. 12 మండలాల పరిధిలోని 32 గ్రామాల్లో 172 మంది రైతులు సాగు చేసిన వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 70 ఎకరాల్లో పైరు దెబ్బతినగా, చౌడేపల్లె మండలంలోని ఒకే గ్రామంలో 40 ఎకరాలు, యాదమరి మండలంలోని ఐదు గ్రామాల్లో 12.25 ఎకరాలు సాగు చేసిన వరి పైరు దెబ్బతింది.
News October 24, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో బంగారుపాళ్యం మినహా 31 మండలాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిండ్రలో 83.4 మిమీ, అత్యల్పంగా పెద్దపంజాణిలో 2.6 మిమీ వర్షపాతం నమోదయ్యింది. మండలాల వారీగా కుప్పంలో 35.2, విజయపురంలో 34.4, నగరిలో 28.8, శ్రీరంగరాజపురంలో 26.8, పాలసముద్రంలో 26.6, గుడుపల్లెలో 23.6, సోమలలో 14.6 మీ. మీ వర్షపాతం నమోదు అయింది.
News October 23, 2025
చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్‌పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.


