News April 2, 2026
కడప: YVUలో ఉద్యోగాలు

కడప YVU పీజీ కళాశాల కామర్స్ శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రధానాచార్యులు ప్రొ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు ఎం.ఎస్.సి (కంప్యూటర్ సైన్స్) /ఎం.సి.ఎ./ ఎం.టెక్. కంప్యూటర్స్ అర్హత ఉండాలన్నారు. నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగినవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలన్నారు.
Similar News
News April 6, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,070
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,864
* వెండి 10 గ్రాముల ధర రూ.2,385.
News April 6, 2026
కడప జిల్లా సరిహద్దుల్లో మార్పులు

జిల్లాల పునర్వ్యవస్థీకరణతో సరిహద్దుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 7 జిల్లాల సరిహద్దులు కలిగిన ఏకైక జిల్లాగా కడప జిల్లా నిలిచింది. అన్నమయ్య జిల్లా మార్పులతో రూపురేఖలు పూర్తిగా మారాయి. కొన్ని నియోజకవర్గాలను ఇతర జిల్లాల్లోకి విలీనం చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి చేరడంతో కొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి. భౌగోళికంగా కడప జిల్లా కేంద్ర స్థానంలో ఉండటంతో ప్రాధాన్యం పెరిగింది.
News April 6, 2026
BREAKING: కడపలో దారుణ హత్య

కడప రిమ్స్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్‌పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


