News April 2, 2026
NTR: తల్లీబిడ్డను కాపాడారు..!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో సుఖప్రసవం చేశారు. పెనుగంచిప్రోలుకి చెందిన రాజేశ్వరి(25)కి పురిటినొప్పులు రావడంతో తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం జగ్గయ్యపేటకు తరలించారు. మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమవ్వడంతో వాహనంలోనే సిబ్బంది డెలివరీ చేయగా, ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 18, 2026
హిట్ అండ్ రన్ కేసులో లొంగిపోయిన మాజీ MLA కొడుకు

TGలో 2022లో కలకలం రేపిన BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న రాహిల్ కోర్టు ఆదేశాలతో మూడేళ్ల తర్వాత తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2022 మార్చి 18న జూబ్లీహిల్స్‌లో రోడ్డు దాటుతున్న కొందరిని MLA స్టిక్కర్ ఉన్న కారు ఢీకొట్టింది. ఇందులో 2 నెలల బాలుడు చనిపోగా, ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఈ కేసులో రాహిల్ నిందితుడిగా ఉన్నారు.
News April 18, 2026
PDPL: శిధిలావస్థలో వెయ్యి ఏళ్ల శివాలయం

ఉమ్మడి KNR(D)లో ఎన్నో అపురూప కట్టడాలు నిర్లక్ష్యానికి గురై కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అందులో మంథని(M) గుంజపడుగు శివారులోని చారిత్రక శివాలయం ఒకటి. గోదావరి ఒడ్డున ప్రశాంత వాతావరణంలో కొలువైన ఈ ఆలయం శాతవాహనుల కాలం నాటి విశిష్ట నిర్మాణ శైలికి అద్దం పడుతోంది. వెయ్యేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యానికి గురై ఆదరణకు నోచుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 18, 2026
BHPL: పరిషత్ రిజర్వేషన్లపై ఆశావహుల ఉత్కంఠ!

జిల్లాలోని 12 ZPTC, 109 MPTC స్థానాల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో నోటిఫికేషన్ విడుదలైన సమయంలో రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ, న్యాయస్థానంలో పిటిషన్ల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది.తాజాగా ప్రభుత్వం ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండటంతో, పాత రిజర్వేషన్లే కొనసాగుతాయా లేక కొత్తగా మారుస్తారా అన్న చర్చ మొదలైంది. తమకు కేటాయించే స్థానాల బట్టి వ్యూహాలు సిద్ధం చేసుకునే పనిలో ఆశావహులు ఉన్నారు.


