News April 2, 2026
టీయూలో ప్రేరణ-2026

తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (TCA), తెలంగాణ యూనివర్సిటీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రేరణ-2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్’లో భాగంగా వర్సిటీ స్థాయి పోటీలు గురువారం నిర్వహించారు. 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి, ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
NZB: GGH ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డా.నాగమోహన్

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (GGH) ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వ వైద్య కళాశాల, GGH ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్ నాగ మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంత వరకు ఇక్కడ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్ నల్గొండ GGHకు బదిలీ అయ్యారు.
News April 10, 2026
కందకుర్తిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

రెంజల్ మండలం కందకుర్తిలో ఈనెల 11న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. కందకుర్తిలో స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భగవత్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ తహశీల్దార్, ఆర్&బి డీఈతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
News April 10, 2026
రేపు నిజామాబాద్ జిల్లాకు RSS చీఫ్ మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ శనివారం NZB జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కంద కుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.


