News April 2, 2026

భీమవరంలో సంబరాలు

image

అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించడంతో జిల్లావ్యాప్తంగా గురువారం పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. తొలుత అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజధాని ఖరారు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

Similar News

News April 9, 2026

ప.గో: రోడ్డు ప్రమాదం.. కాలు, చెయ్యి నుజ్జునుజ్జు

image

పెనుగొండ మండల వడలి శివారు ఇటుకల బట్టి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట వేమవరం గ్రామానికి చెందిన మైలే రాజారావు (55) తీవ్రంగా గాయపడ్డారు. మోటార్ సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో, ట్రాక్టర్‌ మధ్య ఇరుక్కుపోవడంతో ఆయన ఎడమ కాలు, చెయ్యి నుజ్జునుజ్జు అయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News April 8, 2026

నరసాపురం: ఏడేళ్ల బాలికపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులు

image

నరసాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న బాలిక(7)పై స్కూల్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఈనెల 4న స్కూల్ ముగిసిన తర్వాత వ్యాన్‌లో ఇంటికి వస్తుండగా, డ్రైవర్ నక్కా మహేంద్ర బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిపోయిన చిన్నారి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు వివరించింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.