News May 9, 2024

ఆర్థిక, రాజకీయ భీష్ముడు రోశయ్య

image

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న రాజకీయ భీష్ముడు కొణిజేటి రోశయ్య. కంచుకంఠంతో చమక్కులు.. చురుక్కులు విసురుతూ చట్టసభలో విపక్షాల విమర్శలను విరిచేసేవారు. 1968లో MLCగా చట్టసభలో అడుగుపెట్టిన ఆయన.. తర్వాత MLA, MPగాను గెలుపొందారు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయన సొంతం. YS మరణానంతరం CMగా 14నెలలు కొనసాగారు. ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News December 25, 2024

తిరుమల పరకామణిలో కుంభకోణం?

image

AP: తిరుమల పరకామణిలో గతంలో రూ.కోట్లలో స్కామ్ జరిగిందని TTD ఛైర్మన్ BR నాయుడికి బోర్డు సభ్యుడు భాను‌ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశీ కరెన్సీ లెక్కింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణిలో చోరీపై పెద్ద జీయంగార్ మఠం ఉద్యోగిపై కేసు నమోదైందని, ఆ కేసు తిరిగి విచారించాలన్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్‌లో రాజీ పడ్డామన్న విజిలెన్స్ అధికారుల నివేదికను ఆయన తప్పుబట్టారు.

News December 25, 2024

విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు

image

బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.

News December 25, 2024

క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్

image

ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.