News May 9, 2024

ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం: సజ్జల

image

AP: దేశ GDPలో రాష్ట్ర వాటా 4.82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షాలను ప్రశ్నించారు. ‘ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం. సచివాలయాలు, RBKలు, విలేజ్ క్లినిక్‌లు నిర్మించాం. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చాం. నాడు-నేడుతో వాటి రూపురేఖలు మార్చాం. సంక్షేమ పథకాల ద్వారా కోటి కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడేలా చేశాం’ అని తెలిపారు.

Similar News

News December 25, 2024

హుజురాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవర్మరణం

image

ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన KNR జిల్లా HZB మం.లో జరిగింది. CI తిరుమల్ గౌడ్ వివరాలు.. ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ(18) అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్(19) వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది.

News December 25, 2024

ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య

image

తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హనుమకొండలోని ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.

News December 25, 2024

మళ్లీ జోరు పెంచిన BITCOIN

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పరుగులు పెట్టాయి. టాప్ 10 కాయిన్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. బిట్‌కాయిన్ ఏకంగా 3.99% పెరిగింది. $3789 లాభంతో $98,663 వద్ద ముగిసింది. నేడు $489 నష్టంతో $98,412 వద్ద కొనసాగుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 2.30% లాభంతో $3,485 వద్ద ట్రేడవుతోంది. XRP 1.46, BNB 1.75, SOL 4.30, DOGE 3.39, ADA 1.30, TRON 1.75, AVAX 5.90, LINK 2.68, SHIP 3.59% మేర ఎగిశాయి.