News May 9, 2024
ఏపీలో పర్యటించనున్న రాహుల్
ఏపీసీపీ చీఫ్ షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఈ నెల 11న కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కడప విమానాశ్రయం చేరుకోని ముందుగా రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ క్రమంలో ఆయన రాకతో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఏ మేరకు కలిసి వస్తుందో అని ఆసక్తి నెలకొంది.
Similar News
News December 25, 2024
ఇంటర్ అమ్మాయి ఆత్మహత్య
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. తాజాగా హనుమకొండలోని ఏకశిలా కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి అనారోగ్యం కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యాసంస్థల్లో ఓ వైపు ఫుడ్ పాయిజన్, మరోవైపు ఆత్మహత్యలు చర్చనీయాంశంగా మారాయి.
News December 25, 2024
మళ్లీ జోరు పెంచిన BITCOIN
క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో పరుగులు పెట్టాయి. టాప్ 10 కాయిన్లు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. బిట్‌కాయిన్ ఏకంగా 3.99% పెరిగింది. $3789 లాభంతో $98,663 వద్ద ముగిసింది. నేడు $489 నష్టంతో $98,412 వద్ద కొనసాగుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 2.30% లాభంతో $3,485 వద్ద ట్రేడవుతోంది. XRP 1.46, BNB 1.75, SOL 4.30, DOGE 3.39, ADA 1.30, TRON 1.75, AVAX 5.90, LINK 2.68, SHIP 3.59% మేర ఎగిశాయి.
News December 25, 2024
టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్(ITBP)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. 7 హెడ్ కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్), 44 కానిస్టేబుల్ (మోటార్ మెకానిక్) పోస్టులు భర్తీ చేయనున్నారు. 18-25 వయస్సు, ఆసక్తి కలిగిన పురుషులు వచ్చే ఏడాది జనవరి 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్, కానిస్టేబుల్ పోస్టులకు టెన్త్ పాసై ఉండాలని బోర్డు తెలిపింది. అదనపు వివరాల కోసం ఇక్కడ <