News May 9, 2024

Elections: తెర వెనుక గ్రాడ్యుయేట్లు

image

ఈ ఎన్నికల్లో అందరికీ నాయకుల సభలు, ర్యాలీలు, ప్రసంగాలే కనిపిస్తున్నాయి. అయితే.. ఇదే ఎన్నికల కోసం పలువురు గ్రాడ్యుయేట్లు తెరవెనుక పాత్ర పోషిస్తున్నారు. తాజా పరిస్థితులను విశ్లేషించి, డేటా సేకరించి పొలిటికల్ పార్టీలకు అందిస్తున్నారు. ఈ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ప్రజల సమస్యలు, వారి అభిప్రాయాలు సేకరించేందుకు పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థలు తమ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో రంగంలోకి దించాయి.

Similar News

News December 25, 2024

తిరుమల పరకామణిలో కుంభకోణం?

image

AP: తిరుమల పరకామణిలో గతంలో రూ.కోట్లలో స్కామ్ జరిగిందని TTD ఛైర్మన్ BR నాయుడికి బోర్డు సభ్యుడు భాను‌ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశీ కరెన్సీ లెక్కింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణిలో చోరీపై పెద్ద జీయంగార్ మఠం ఉద్యోగిపై కేసు నమోదైందని, ఆ కేసు తిరిగి విచారించాలన్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్‌లో రాజీ పడ్డామన్న విజిలెన్స్ అధికారుల నివేదికను ఆయన తప్పుబట్టారు.

News December 25, 2024

విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు

image

బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.

News December 25, 2024

క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్

image

ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.