News May 9, 2024
రేపు ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం
AP: మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు జోరు పెంచారు. రేపు ఒక్కరోజే ఐదు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలులో ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. చివరి రోజైన శనివారం 3 సభల్లో పాల్గొననున్నారు. కాగా అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది.
Similar News
News December 25, 2024
రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల డబ్బు.. ఇతనివే!
మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్‌గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్‌కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.
News December 25, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నిన్న 1.40 లక్షల రూ.300 టికెట్లను ఆన్‌లైన్లో రిలీజ్ చేయగా అరగంటలోనే అయిపోయాయి.
News December 25, 2024
సినిమా ఇండస్ట్రీని బోనులో నిలబెట్టే ప్రయత్నం: ఈటల
TG: CM రేవంత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని BJP MP ఈటల రాజేందర్ మండిపడ్డారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్‌కి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని.. వారి పర్యటనల్లో ముందస్తు ఏర్పాట్లు అవసరమన్నారు. ఏదీ ఏమైనా, ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటన గుణపాఠం కావాలని, వీఐపీలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.