News April 4, 2026

అల్లూరి: శబరి నదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

ప్రమాదవశాత్తు శబరి నదిలో కొట్టుకుపోయిన శివ<<19559176>> మృతదేహం<<>> శుక్రవారం రాత్రి లభ్యం అయ్యింది. వరరామచంద్రపురం (M) రాజుపేట కాలనీకు చెందిన బొర్రా శివ (19) శుక్రవారం శబరి నదిలో గల్లంతు అయిన సంగతి తెలిసిందే. నదిలో దిగిన శివ కొంత మంది చూస్తుండగానే నీటిలో మునిగి పోయాడు. అతనిని కాపాడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. కాగా పోలీసులు, మత్స్య శాఖ సిబ్బంది గాలింపు చేపట్టగా మృతదేహం లభించింది.

Similar News

News April 19, 2026

మరోసారి సిద్ధార్థ్-త్రిష కాంబోలో మూవీ?

image

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో క్యూట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్-త్రిష జోడీ మళ్లీ రిపీట్ కానుందా? అంటే ఫిలిమ్ సర్కిల్స్‌లో అవుననే బజ్ నడుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని.. ఓ కొత్త డైరెక్టర్‌తో సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా చివరగా త్రిష-సిద్ధార్థ్ అరణ్మనై-2 అనే హారర్ మూవీలో నటించారు.

News April 19, 2026

నెల్లూరు: ఉప్పు కాలువలో పడి వ్యక్తి మృతి.. ఇతను మీకు తెలుసా?

image

తోటపల్లి గూడూరు మండలం కొత్త పట్టపుపాలెం వద్ద ఉన్న ఉప్పు కాలువలో గుర్తు తెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం సాయంత్రం తెలిపారు. మృతుడి వయస్సు 40 ఏళ్లు ఉండవచ్చు. అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చ బొట్టు ఉంది. గోధుమ రంగు కలర్ పై బ్లూ, పింక్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న ఫుల్ షర్ట్, తెల్లటి బనియన్, నల్లని నైట్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు.