News April 4, 2026

ఇవాళ, రేపు జాగ్రత్త!

image

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.

Similar News

News April 18, 2026

టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

image

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

News April 18, 2026

గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగనున్న RCB

image

IPL-2026లో ఈరోజు RCBతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో ఆర్సీబీ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ‘Go Green’ ఇనిషియేటివ్ కింద ఏటా ఒక హోమ్ మ్యాచ్‌లో ఆ జట్టు ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరిస్తుంటారు. కాగా RCBలో ఈ ట్రెండ్ 2011 నుంచి కొనసాగుతోంది.

News April 18, 2026

జియో IPO.. టార్గెట్ రూ.50,000కోట్లు!

image

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెబీకి ఐపీవో పత్రాలను సమర్పించనుంది. సుమారు రూ.40,000-50,000కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ నెలకొల్పనుంది. IPO నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను జియో నియమించుకుంది. సంస్థ మార్కెట్ వాల్యూ రూ.16.72లక్షల కోట్లు కాగా ఇందులో 2.5% వాటా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.