News April 4, 2026

NLG: అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

image

నల్గొండ జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. నల్గొండ, దేవరకొండలో ఎస్ఎఫ్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఓ/ఎస్ఎఫ్ఓ ఖాళీలు నల్గొండలో 1, నకిరేకల్‌లో 2, హాలియాలో 1 ఉన్నాయి. ఫైర్‌మెన్ (ఎఫ్‌ఎం) పోస్టులు దేవరకొండ, నకిరేకల్‌లో 4 చొప్పున, మిర్యాలగూడలో 3, హాలియాలో 2 ఖాళీగా ఉన్నాయి. వేసవిలో అగ్నిప్రమాదాలు పెరిగే ముప్పు ఉన్నందున వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News April 20, 2026

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

image

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.

News April 19, 2026

NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

image

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.