News April 4, 2026
JGTL: మంత్రి అడ్లూరి.. జీవన్ రెడ్డిలా నడిపించగలరా?

గత 40 ఏళ్లుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉండి, పార్టీని నడిపించారు. జగిత్యాలతోపాటు ధర్మపురి, చొప్పదండి, కోరుట్ల, వేములవాడ అభ్యర్థుల గెలుపులో కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఆయన రాజీనామాతో, బాధ్యతలన్నీ మంత్రి అడ్లూరిపై పడ్డాయి. మంత్రి జిల్లా నియోజకవర్గాల్లో పట్టు సాధించగలరా?, అన్ని చోట్ల నిర్ణయాత్మకంగా మారి, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయగలరా? అనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News April 5, 2026
తిరుపతి: దరఖాస్తుల గడువు పొడిగింపు

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2026 సంవత్సరానికి Ph.D/ M.S(Research) ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/admissions వెబ్ సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 13.
News April 5, 2026
మాడుగుల: ఒకే బైక్‌పై ఐదుగురు.. యాక్సిడెంట్‌తో తీవ్ర గాయాలు

మాడుగుల మండలం ఎం.కోటపాడు జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు గాయపడ్డారు. పరిమితికి మించి ఒకే బైక్ మీద ఐదుగురు యువకులు కాశీపురం నుంచి ఎం.కోటపాడు వస్తూ నిలిపి ఉన్న బొలెరోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉందని,108లో ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
News April 5, 2026
ధురంధర్-2ను వీక్షించిన పాక్ మాజీ ప్రధాని?

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ధురంధర్-2 సినిమా కాపీని తెప్పించుకొని వీక్షించినట్లు ఆ దేశానికి చెందిన జర్నలిస్టు ఖలీద్ వెల్లడించారు. అందులో తన పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని ఆయన మెచ్చుకున్నట్లు తెలిపారు. పాక్‌లో ఈ చిత్రంపై నిషేధం విధించినప్పటికీ తాను తొలి రోజే చూసినట్లు ఖలీద్ గతంలో చెప్పారు. కాగా ధురందర్-2లో నవాజ్ పాత్రను మషూర్ అమ్రోహి పోషించారు. క్యాస్టింగ్ పర్‌ఫెక్ట్‌గా సెట్టవడం విశేషం.


