News May 9, 2024
కార్యాలయాలకు సెలవు: జిల్లా కలెక్టర్ హరి చందన
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు ఎన్నికల పోలింగ్ రోజు 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, సంస్థలకు సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యా సంస్థలు, కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల నిమిత్తం ఈ నెల 12వ తేదీ సైతం సెలవుదినంగా ప్రకటించారు.
Similar News
News November 17, 2024
NLG: ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ రిలీజ్
నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఖాళీగా ఉన్న జిల్లా ప్రోగ్రాం అధికారి పోస్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రొవిజినల్ మెరిట్ జాబితాను www.nalgonda.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ నోటీస్ బోర్డులో ప్రకటించారని డీఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలు ఉన్నట్లయితే సోమవారం మధ్యాహ్నం లోగా లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు.
News November 17, 2024
నల్గొండ: గ్రూప్-3 పరీక్షలు.. ఇవి గుర్తుపెట్టుకోండి!
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరుకావాలని, ఉదయం 10 గం. ప్రారంభమయ్యే పేపర్-1 పరీక్షకు 8:30 గంటలలోపు, పేపర్-2కి 1:30- 2:30 వరకు పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాలన్నారు. మొదటి రోజు పేపర్-1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు తీసుకొని రావాలని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
#SHARE IT
News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి
నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.