News April 4, 2026

భర్తతో గొడవ.. గోదావరిలోకి దూకేద్దామని..!

image

భర్తతో గొడవపడి గోదావరిలో దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కాపాడారు. శుక్రవారం రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద గోదావరిలో దూకడానికి ప్రయత్నించిన మహిళను శక్తి టీం పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి చెందిన ఈ మహిళ భర్తతో గొడవపడి చనిపోవడానికి వచ్చింది. ఆమె కదలికలను గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు చెప్పగా వారు వచ్చి రక్షించారు.

Similar News

News April 8, 2026

నన్నయ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ రాక

image

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. బుధవారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ స్నాతకోత్సవ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లు, వివరాలను గవర్నర్‌కు వివరించారు. గవర్నర్ రాకతో విశ్వవిద్యాలయ వర్గాల్లో ఉత్సాహం నెలకొంది. ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు.

News April 8, 2026

10న జిల్లాకు రానున్న గవర్నర్

image

గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ నెల 10వ తేదీ శుక్రవారం తూ.గో జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. ఆరోజు విజయవాడ నుంచి హెలికాప్టర్‌లో రాజమండ్రి చేరుకుంటారని ఆమె వెల్లడించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో జరిగే XVI, XVII సంయుక్త కన్వొకేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 8, 2026

రాజమండ్రి: ఓటు వేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు

image

పుదుచ్చేరి(ఏప్రిల్ 9), తమిళనాడు(ఏప్రిల్ 23) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన జిల్లా కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాజమండ్రి సహాయ కార్మిక కమిషనర్ విజయ ప్రకాశ్ ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సంస్థల యజమానులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్మికుల ఓటు హక్కును గౌరవించాలని ఆయన మంగళవారం స్పష్టం చేశారు.