News May 9, 2024
నా జీవితంలో తప్పు చేయలేదు: చంద్రబాబు
AP: జైలులో ఉన్నప్పుడు తనను చంపేందుకు ప్రయత్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. విశాఖ సభలో మాట్లాడుతూ.. ‘నా జీవితంలో తప్పు చేయలేదు.. అందుకే భయపడను. రాజకీయ రౌడీలను వదిలిపెట్టేది లేదు. వైసీపీ నేతలు వైజాగ్‌లో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. ఇక్కడి ప్రజలు ఎంతో ముందుచూపుతో 2014లో విజయమ్మను ఓడించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2024
ఫార్ములా-ఈ రేస్ కేసులో కీలక పరిణామం
TG: ఫార్ములా-ఈ రేస్ కేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ రికార్డు చేసింది. దీని ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించనుంది. కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు నోటిసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ-రేస్‌లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దాన కిషోర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
News December 25, 2024
రోడ్డు పక్కన 52 కేజీల బంగారం, రూ.11 కోట్ల డబ్బు.. ఇతనివే!
మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఇటీవల రోడ్డు పక్కన కారులో 52 కేజీల <<14936521>>బంగారం<<>>, రూ.11 కోట్ల నగదు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది బిల్డర్‌గా మారిన ఆర్టీవో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ అనుచరుడు చేతన గౌర్‌కు చెందిన కారుగా గుర్తించారు. తాజాగా, లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ ఇంట్లో రూ.2.87 కోట్ల నగదు, 234 కేజీల వెండిని సీజ్ చేశారు. వీరిద్దరిపై ఈడీ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది.
News December 25, 2024
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. మరోవైపు, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నిన్న 1.40 లక్షల రూ.300 టికెట్లను ఆన్‌లైన్లో రిలీజ్ చేయగా అరగంటలోనే అయిపోయాయి.