News May 9, 2024

HYDలో మత సామరస్యాన్ని BRS కాపాడింది: CM రేవంత్

image

HYD చాలా సున్నితమైన ప్రాంతమని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాజాగా ఛానెల్‌ ముఖాముఖి‌లో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లు పాలించిన TDP, కాంగ్రెస్, BRS ప్రభుత్వాలు హైదరాబాద్‌‌లో మత కల్లోహాలు లేకుండా కాపాడాయి. ఈ రోజు BJP ఇక్కడ నాలుగు సీట్లు గెలవడం కోసం మైనార్టీల్లో, మెజార్టీ వర్గాల్లో అభద్రత‌, భయాన్ని‌ రేకెత్తించడం ఎంతవరకు సమంజసం? పెట్టుబడులను గుజరాత్‌ తరలించడానికే BJP కుట్ర చేస్తోంది’ అంటూ‌ CM ఆరోపించారు.

Similar News

News October 10, 2024

BREAKING.. HYD: విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

విస్తారా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు.

News October 10, 2024

HYD: దసరా స్పెషల్.. ఆయుధాలకు పూజలు

image

రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపీఎస్ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆయుధ పూజ, వాహన పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు వాహనాలు, తుపాకులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ అడ్మిన్ డీసీపీ ఇందిర, అడిషనల్ డీసీపీ శ్యాంసుందర్, ఏసీపీ, ఇతర సిబ్బంది సైతం పాల్గొన్నారు.

News October 10, 2024

HYD: ESI కాలేజీలో పారామెడికల్ కోర్సులు

image

హైదరాబాద్ సనత్‌నగర్ ESI మెడికల్ కాలేజీలో పారా మెడికల్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు ప్రారంభానికి అనుమతి లభించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో 194వ ESI సమావేశంలో ఆమోదం ముద్ర వేశారు. మెడికల్ కాలేజీ ఈ కోర్సులు ప్రారంభానికి అనుమతి లభించటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.