News May 10, 2024

అనకాపల్లి: ఎన్నికల ప్రక్రియపై ట్రైనీ ఐపీఎస్‌లకు అవగాహన

image

ఎన్నికల ప్రక్రియపై నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి వచ్చిన తొమ్మిది మంది ట్రైనీ ఐపీఎస్‌లకు అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పలువురు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు. ఈనెల 13వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రక్రియ గురించి తెలుసుకుంటారని ఎస్పీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బందోబస్తు, భద్రత ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి తదితర అంశాలను పరిశీలిస్తారన్నారు.

Similar News

News January 24, 2025

పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు

image

పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

News January 24, 2025

విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.

News January 24, 2025

కొత్తపల్లి జలపాతం నాలుగు రోజులు మూసివేత

image

జీ.మాడుగుల మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొత్తపల్లి జలపాతాన్ని ఈనెల 24 నుంచి 27 వరకు మూసివేస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ గురువారం తెలిపారు. జనవరి 24వ తేదీ నుంచి 27 వరకు జలపాతం ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ఎవరికి ప్రవేశం లేదని చెప్పారు. ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు కొత్తపల్లి జలపాతం సందర్శించవద్దని అభిషేక్ పేర్కొన్నారు.