News April 5, 2026
BREAKING.. నిర్మల్‌లో అగ్ని ప్రమాదం.. ఇద్దరి మృతి

నిర్మల్ బంగల్పేట్ <<19570362>>డబుల్ <<>>బెడ్ రూమ్ ఇళ్లలో శనివారం రాత్రి ఫ్రిజ్ పేలిన ఘటనలో గాయపడిన ఇద్దరు ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులను విజయ్, ఒక మహిళగా స్థానికులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్ ఒక్కసారిగా పేలి మంటలు వ్యాపించడంతో వీరు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 6, 2026
సిద్దిపేట: ఆరోగ్యవంతమైనా జీవన విధానం ద్వారా దీర్ఘాయుష్షు: కలెక్టర్

ఆరోగ్యవంతమైన జీవనశైలితోనే దీర్ఘాయుష్షు సాధ్యమని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుంచి ‘హెల్త్ వీక్’ ప్రారంభమైంది. ఇందులో భాగంగా సిద్దిపేట డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే’లో ఆమె పాల్గొన్నారు. ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ, వారం రోజుల పాటు జరిగే ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News April 6, 2026
‘సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతో విద్యుత్ ఖర్చు ఆదా’

పీఎం సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకంపై భద్రాద్రి కలెక్టర్ అంకిత్ సమావేశమయ్యారు. ఈ పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడటం తోపాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
News April 6, 2026
VJA: VMCలో బిల్లుల మోక్షం.. కాంట్రాక్టర్ల ఊపిరి!

విజయవాడ నగరపాలక సంస్థలో గత కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.100ల కోట్ల బిల్లుల వివాదం ఓ కొలిక్కి వచ్చింది. రూ.500కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో, సాధారణ పనులు మినహా మిగిలినవన్నీ కాంట్రాక్టర్లు నిలిపివేసి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. స్పందించిన అధికారులు విడతల వారీగా చెల్లింపులకు అంగీకరించారు. నిన్న రూ.5కోట్లు, ఈ నెల 15న మరో రూ.5కోట్లు, నెలాఖరుకు రూ.10కోట్లు విడుదల చేయనున్నారు.


