News May 10, 2024

MBNR: అందరికీ ఇదే సమాధానం.. అంతుచిక్కని ఓటరు నాడి..!

image

పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు, ముఖ్య నేతలకు ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ప్రచారానికి వెళ్లి ఓట్లు వేయమని అడుగుతున్న అభ్యర్థులకు ఓటర్లు తెలివిగా సరే అంటూ తలూపుతున్నారు. ప్రచారానికి వెళ్లిన అన్ని పార్టీల వారికి ఇదే విధమైన సమాధానాలు వస్తుండడంతో ఇంతకు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో తెలియక ఇటు అభ్యర్థులు.. అటు ముఖ్యమైన నేతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.

Similar News

News January 19, 2025

మహబూబ్‌నగర్‌లో అసాంఘిక కార్యకలాపాలు?

image

మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం చౌరస్తాలో పట్టపగలే చీకటి పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌరస్తాలో చుట్టూ బ్యానర్లు ఉండటంతో, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడుతున్నట్లు సోషల్‌మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఇలా బరితెగించారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలని మహబూబ్‌నగర్ ప్రజలు కోరారు.

News January 19, 2025

MBNR: ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 26న ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం క్షేత్రస్థాయి పరిశీలనపై శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

News January 19, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఉమ్మడి జిల్లాల్లో జోరుగా వరి సాగు
✔అయిజ:BRS కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరిక
✔అచ్చంపేట:మూడు కార్లు ఢీ.. ఒకరు మృతి
✔ఘనంగా Sr. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
✔ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష
✔అచ్చంపేట:కత్తితో దాడి.. వ్యక్తికి తీవ్రగాయాలు
✔NGKL: ఉమామహేశ్వర స్వామికి నంది వాహన సేవ
✔డ్రంక్ అండ్ డ్రైవ్..పోలీసుల తనిఖీలు
✔రాష్ట్ర మహా సభల వాల్ పోస్టర్ విడుదల
✔క్రీడా బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యేలు