News May 10, 2024
రాజకీయ ప్రకటనలకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్

పోలింగ్ మే 13న జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ జరిగే రోజుల్లో ఈనెల 12, 13 తేదీలలో పత్రికల్లో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ఎంసిఎంసి నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు.
Similar News
News October 25, 2025
నెల్లూరు: సమ్మె విరమించిన PHC వైద్యులు

నెల్లూరు జిల్లాలోని PHC వైద్యులు సమ్మె విరమించి ఇవాళ నుంచి విధులకు హజరవుతున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. మంత్రి 2025-26 విద్యా సంవత్సరంలో PG మెడికల్ ఇన్ సర్వీసు కోటాను 20%, 2026–27లో 15% కోటాను సాగించేందుకు హామీ ఇచ్చారని, ట్రైబల్ అలవెన్స్, టైంబౌండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, అర్బన్ సర్వీస్ ఎలిజిబులిటీ ఐదేళ్లకు కుదింపు వంటిసమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు.
News October 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదంలో 10 మంది నెల్లూరీయులు!

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది నెల్లూరీయులు ఉన్నారు. వీరిలో వింజమూరు(M) గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్, భార్య అనూష, చిన్నారులు శశాంక్, మన్విత సజీవ దహనమయ్యారు. దుత్తలూరు(M) కొత్తపేటకు చెందిన మరో కుటుంబం నేలకుర్తి రమేశ్, భార్య శ్రీలక్ష్మి, జశ్వత, అభిరామ్‌తోపాటు నెల్లూరు వేదాయపాళెం వెంకటరెడ్డినగర్‌కి చెందిన శ్రీహర్ష, డైకాస్ రోడ్డుకు చెందిన హారిక ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు.
News October 25, 2025
నుడా వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జేసీ

నుడా వైస్ ఛైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. బొకే అందజేసి శాలువతో సత్కరించారు. నుడా సంస్థ అభివృద్ధి దిశగా పయనించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోటంరెడ్డి కోరారు. అనంతరం నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించుకున్నారు.


