News April 5, 2026
PGRS అర్జీల స్థితిని తెలుసుకోండిలా: GNT కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూక్లీనిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. మీకోసం వెబ్ సైట్‌లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News April 20, 2026
GNT: ఇస్రో ‘యువికా’కు జిల్లా విద్యార్థినుల ఎంపిక.. కలెక్టర్ ప్రశంసలు

జాతీయ స్థాయిలో ఇస్రో నిర్వహించిన ‘యువికా’ యంగ్ సైంటిస్ట్ అవార్డులకు ఎంపికైన జిల్లా విద్యార్థినులను కలెక్టర్ సాయి కాంత్ వర్మ అభినందించారు. ఫిరంగిపురం (M) వేములూరిపాడుకు చెందిన జ్యోతిర్మయి, వట్టిచెరుకూరు (M) ముట్లూరుకు చెందిన సుస్మితా చంద్ ఈ గౌరవం దక్కించుకున్నారు. సోమవారం DEO సలీం భాషాతో కలిసి కలెక్టరేట్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. విద్యార్థినుల ప్రతిభను కలెక్టర్ ప్రత్యేకంగా కొనియాడారు.
News April 20, 2026
పట్టాలెక్కని ముఖ్య అమరావతి ప్రాజెక్టులు

అమరావతిలో కీలక నిర్మాణాలెవీ ఇంకా ప్రారంభం కాలేదు. ORR, IRR, విజయవాడ మెట్రో, విమానాశ్రయం, రైల్వే లైన్ వంటి ప్రాజెక్టులు ముందుకు సాగలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇవన్నీ టెండర్లు, భూసేకరణ దశల్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధికి ఈ ప్రాజెక్టులే అత్యంత కీలకం. ఇవి పట్టాలెక్కితేనే నగర రవాణా మెరుగుపడుతుందన్నారు. ప్రణాళికలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు ఇంకా మొదలు కాలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.