News April 5, 2026

సిరిసిల్ల: ‘అవసరమైన విద్యుత్తును అందజేస్తాం’

image

పవర్లూమ్ పరిశ్రమల అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తామని TGNPDCL సిఎండి వరుణ్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలోని పవర్ లూమ్ పరిశ్రమలను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా విద్యుత్ ఆదా సాధించడంతోపాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై దృష్టి సారిస్తామన్నారు. నేతన్నల సంక్షేమం పట్ల కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.

Similar News

News April 19, 2026

పవన్ త్వరగా కోలుకోవాలి.. చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష

image

శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం <<19685329>>పవన్ కళ్యాణ్<<>> త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని దేవుడిని ప్రార్థించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే ఆయన డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేశ్ కోరారు. పవన్ ఆరోగ్యవంతుడై మళ్లీ ప్రజా సేవలో బిజీ కావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News April 19, 2026

బబుల్ గమ్ మింగితే ఏమవుతుంది?

image

బబుల్ గమ్ మింగితే ఏళ్లపాటు అది కడుపులోనే ఉండిపోతుందనేది అపోహ మాత్రమేనని వైద్యులు తేల్చిచెప్పారు. ‘జీర్ణం కాకపోయినా ఆహారనాళం నుంచి కడుపులోకి, అక్కడి నుంచి పేగుల్లోకి ప్రయాణించి 4-5 రోజుల్లో మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఎక్కడా అతుక్కోదు. కడుపు నొప్పి, వాంతుల లాంటి సమస్యలూ రావు. పొరపాటున మింగితే కంగారు పడాల్సిన పనిలేదు. అలా అని కావాలని మింగొద్దు’ అని డాక్టర్లు చెబుతున్నారు.

News April 19, 2026

అనకాపల్లి: రహదారిపై బస్సు బోల్తా.. పలువురికి గాయాలు..!

image

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.