News April 6, 2026
విజయవాడలో గంజాయి స్వాధీనం

గంజాయి అక్రమ రవాణాపై విజయవాడలో పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. ఆదివారం కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ అనే వ్యక్తి గంజాయి కలిగి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అతన్ని తనిఖీ చేయగా రత్నకుమార్ వద్ద 1.5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 18, 2026
GNT: జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాలు

గుంటూరు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి తెలిపారు. జూనియర్ అసిస్టెంట్, ఆప్టోమెట్రిస్ట్, DDM/MIS, NHM, ల్యాబ్ అటెండెంట్, సోషల్ వర్కర్, టీబీ హెల్త్ విజిటర్, సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని వివరాలకు www.guntur.nic.in సైట్‌ను సందర్శించాలన్నారు.
News April 18, 2026
సత్యసాయి: కార్లు అద్దెకు తీసుకొని మోసం.. నిందితుడి అరెస్ట్

కార్లను బాడుగకు తీసుకొని, యజమానులకు తెలియకుండా కుదువ పెట్టి మోసం చేసిన అన్నవరం గౌతం రాజును సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు యజమానులను నమ్మించి మూడు కార్లు తీసుకొని, వాటిని ఇతరుల వద్ద కుదువ పెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
News April 18, 2026
ప్రకాశం: రైతుల కోసం బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశాలు

ప్రకాశం జిల్లాలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు కలెక్టర్ పి.రాజాబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి చిన్న ఆక్వా రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ద్వారా రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను ఆదేశించారు. రుణాల మంజూరులో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో మత్స్యశాఖ, నాబార్డ్ అధికారులు, ఆక్వా రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.


