News May 10, 2024

నేటితో ముగియనున్న పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ

image

TG: రాష్ట్రంలో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 2.64 లక్షల మంది పోస్టల్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిన్న 1.76 లక్షల మంది ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 80 ఏళ్లు పైబడిన వారిలో 21,651 మంది ఇంటి నుంచే ఓటు వేశారు.

Similar News

News December 25, 2024

రామ్‍చరణ్ దంపతుల క్రిస్మస్ వేడుకలు

image

సెలబ్రిటీలు క్రిస్మస్‌ను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం తమ సిబ్బందితో పండుగ వేడుకలు చేసుకున్నారు. వీరిలో వారి ఇంటి సిబ్బందితో పాటు అపోలో సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. తమ వద్ద పనిచేసేవారికీ పండుగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ వారిని కొనియాడుతున్నారు.

News December 25, 2024

బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు బాదింది వీరే

image

ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఐదుగురు భారత బ్యాటర్లు మాత్రమే శతకాలు నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), అజింక్య రహానే, విరాట్ కోహ్లీ (2014), చటేశ్వర్ పుజారా (2018), అజింక్య రహానే (2020) సెంచరీలు చేశారు. రహానే రెండు సార్లు శతకాలు సాధించారు. మరి రేపు ప్రారంభం కాబోయే బాక్సింగ్ డే టెస్టులో ఎవరు సెంచరీ బాదుతారో కామెంట్ చేయండి.

News December 25, 2024

ప్రజలను వణికిస్తోన్న చలి పులి

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. TGలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు APలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.