News April 6, 2026
‘కిస్సింగ్ డిసీజ్’తో చాలా డేంజర్

జ్వరం, నీరసం, గొంతు నొప్పితో వచ్చే ‘మోనో’ అనే ఇన్ఫెక్షన్‌ను చాలా మంది లైట్ తీసుకుంటారు. కిస్ చేయడం, డ్రింక్ షేర్ చేసుకోవడం, దగ్గు వల్ల ఇది వ్యాపిస్తుంది. అందుకే దీన్ని కిస్సింగ్ డిసీజ్ అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS) అనే ప్రాణాంతక జబ్బు వచ్చే ప్రమాదం ఉందని ‘న్యూరాలాజీ ఓపెన్ యాక్సెస్’లో పబ్లిష్ అయిన స్టడీ తెలిపింది. MS వల్ల మెదడు, నరాలు దెబ్బతింటాయి.
Similar News
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.


