News May 10, 2024
నేటితో ముగియనున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం
TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత KCR చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. నేడు సిద్దిపేటలో జరిగే సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు. 16 రోజులపాటు 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో KCR బస్సు యాత్ర కొనసాగింది. నేడు సిరిసిల్లలో జరిగే రోడ్ షో, సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రేపు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.
Similar News
News December 25, 2024
బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు బాదింది వీరే
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఐదుగురు భారత బ్యాటర్లు మాత్రమే శతకాలు నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), అజింక్య రహానే, విరాట్ కోహ్లీ (2014), చటేశ్వర్ పుజారా (2018), అజింక్య రహానే (2020) సెంచరీలు చేశారు. రహానే రెండు సార్లు శతకాలు సాధించారు. మరి రేపు ప్రారంభం కాబోయే బాక్సింగ్ డే టెస్టులో ఎవరు సెంచరీ బాదుతారో కామెంట్ చేయండి.
News December 25, 2024
ప్రజలను వణికిస్తోన్న చలి పులి
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రెండు రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. TGలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హైదరాబాద్‌లో 11.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు APలోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
News December 25, 2024
రేపు సెలవు
తెలంగాణలో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఉండనుంది. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు, రేపు ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అటు ఏపీ ప్రభుత్వం ఇవాళ ఒక్కరోజే పబ్లిక్ హాలిడే ఇవ్వగా, రేపు ఆప్షనల్ హాలిడే అని తెలిపింది. అంటే అక్కడి పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు సెలవు ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. ఈమేరకు సెలవు ఉండేది, లేనిది ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించారు.