News May 10, 2024
తూ.గో: పోలింగ్ పెంపుపై ప్రత్యేక శ్రద్ధ
ఉమ్మడి తూ.గో జిల్లాలో రెండు నగరాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలున్నాయి . ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ. అన్ని విధాలా చైతన్యం కలిగిన జిల్లా. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ పెద్దగా పోలింగ్ జరగడంలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 74.64శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 2019లో 79శాతం పోలింగ్ జరిగింది. ఈ సారి కనీసం 85 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Similar News
News November 6, 2024
తూ.గో: TODAY TOP NEWS
*జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్ ప్రశాంతి
*టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన జగ్గంపేట ఎమ్మెల్యే
*పిఠాపురంలో అగ్ని ప్రమాదం
*తుని: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
*కోనసీమ అభివృద్ధిలో భాగం అవుతా: మంత్రి అచ్చెన్న
*జగ్గంపేటలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు
*ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన..టీచర్ అరెస్ట్
*చంద్రబాబు కొట్టిన నా మంచి కోసమే: మంత్రి సుభాష్
*తుని: మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు షాక్
News November 5, 2024
ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. టీచర్ అరెస్ట్
ఐ.పోలవరం హైస్కూల్‌లో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ చేసిన ఫిర్యాదుపై మంగళవారం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై వార్డెన్ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై టీచర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యారు.
News November 5, 2024
మంత్రి అచ్చెన్నాయుడిని కలిసిన బీజేపీ నేతలు
డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమలాపురం వచ్చిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అమలాపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.