News April 6, 2026

బాపట్ల కలెక్టరేట్‌కు 15 ఎకరాలు

image

బాపట్ల కలెక్టరేట్ నూతన భవన నిర్మాణం కోసం 15 ఎకరాల స్థలాన్ని అధికారులు సిద్ధం చేశారు. సోమవారం మంత్రి పార్థసారథి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 10 ఎకరాలకు బదులు 15 ఎకరాలు కేటాయించాలని సూచించారు. భవన నమూనా చిత్రాలు, స్థల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.

Similar News

News April 16, 2026

HYD: మత్తుకు బానిసయ్యారా? ఇక్కడికి తీసుకురండి

image

మత్తుకు బానిసైన వారికి విముక్తి కల్పించడం కోసం ప్రభుత్వం డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించింది. HYD గాంధీ ఆసుపత్రిలోనూ సెంటర్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సేవలు ప్రారంభమయ్యాయి. మద్యం, గంజాయి, సిగరెట్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారటంతో వ్యక్తిగత జీవితంతో పాటు, కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటి నుంచి విముక్తి కల్పించడం కోసం చర్యలు చేపట్టారు.

News April 16, 2026

WGL: తెర మీదకు పాత నియోజకవర్గ పేర్లు!

image

అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లు నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 నుంచి 18 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.దీంతో పెరిగే నియోజకవర్గాలు ఏంటనే చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలు, గతంలో కనుమరుగైన నియోజకవర్గాలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. శాయంపేట, ధర్మసాగర్, గుడూరు, చేర్యాల, హసన్‌పర్తితో పాటుగా కొత్తగా నెక్కొండ, కాజీపేట నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటున్నారు.

News April 16, 2026

టీడీపీ పదవుల్లో ‘పశ్చిమ’కు పెద్దపీట

image

తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపులో ప.గో. జిల్లాలోని అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం దక్కింది. పార్టీ పోలిట్‌బ్యూరోలో నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, రామరాజు, ఎం.ఏ. షరీఫ్‌లకు చోటు కల్పించగా.. పీతల సుజాతకు జాతీయ స్థాయి పదవి వరించింది. అంగర రామ్మోహన్‌కు మరోసారి కీలక బాధ్యతలు దక్కాయి. సీనియర్లకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక సమతుల్యత పాటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.