News May 10, 2024
11న సాయంత్రం నుంచి HYD, రాచకొండలో ఆంక్షలు

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా రాజధానిలో ఎన్నికల ప్రచారం, ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ HYD, రాచకొండ పోలీసు కమిషనర్లు గురువారం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేశారు. 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. పోలింగ్ రోజైన 13న ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News September 13, 2025
ఉప్పల్ శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

HYD ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కూచిపూడి నాట్య గురువు రమేశ్ రాజ్ శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. మూషిక వాహన, అదివో అల్లదిగో, రామాయణ శబ్దం, కృష్ణం కలయసఖి, గోవిందా గోవిందా, అయిగిరి నందిని వంటి అంశాలను సిరిశ్రీ, కీర్తన, చైత్ర, ప్రణుతి, బిందుశ్రీ, వర్షిణి, చైతన్య, జయంత్ తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
News September 13, 2025
శామీర్‌పేట్ నల్సార్ యూనివర్సీటీలో గవర్నర్

HYD శామీర్‌పేట్‌లోని నల్సార్ యూనివర్సిటీలో రెండు రోజులుగా జరిగిన కార్పొరేట్ గవర్నెన్స్ సదస్సు శనివారం ముగిసింది. ICSI, నల్సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక, గిరిజన సమాజాలు ప్రకృతి వనరులను వస్తువులుగా చూడవని, ప్రకృతితో సామరస్యంగా జీవిస్తాయని గవర్నర్ తెలిపారు.
News September 13, 2025
HYD: PM నేతృత్వంలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. PM నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుర్వేదానికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగిందన్నారు. వేల సంవత్సరాల క్రితం నుంచే అనేక వైద్య సమస్యలకు ఆయుర్వేదం పరిష్కారం చూపిందని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి, ప్రపంచస్థాయిలో అవగాహన కోసం కేంద్రం వివిధ చర్యలు చేపడుతోందని వివరించారు.