News May 10, 2024
MBNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
MBNR పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈనెల 13న ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మూత్రశాలలు, షామీయానాలు, తాగునీరు, ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపడుతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో పారామెడికల్ సిబ్బంది సేవలు అందుబాటులో ఉంచనున్నారు.
Similar News
News January 9, 2025
MBNR: మద్దిమడుగు ఆంజన్న రూ.14 కోట్ల ఆస్తిపరుడు
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో ప్రసిద్ధిగాంచిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి రూ.14 కోట్లకు ఆస్తిపరుడు. భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్మును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకులో జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ.14 కోట్లు దేవుడి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉన్నట్లు ఈవో రంగాచారి వెల్లడించారు. ఆ మొత్తానికి వచ్చిన వడ్డీని సైతం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా చేస్తున్నామని తెలిపారు.
News January 9, 2025
అమరచింత: జూరాల ప్రాజెక్టు నేటి నీటి సమాచారం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి సమాచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.225 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిరి ద్వారా 83 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 400, మొత్తం అవుట్‌ఫ్లో 1,481 క్యూసెక్కులను వదులుతున్నట్లు తెలిపారు.
News January 9, 2025
MBNR: 11న కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షణ
పేదల తిరుపతిగా ప్రసిద్దిగాంచిన ఉమ్మడి MBNR జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహా ప్రతిష్ట జరిగి ఆరోజుకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.