News May 10, 2024

టార్గెట్ ఒలింపిక్స్.. డైమండ్ లీగ్‌ బరిలో నీరజ్

image

పారిస్ ఒలింపిక్స్‌లో మరోసారి పసిడి పతకమే లక్ష్యంగా భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిద్ధమవుతున్నారు. ఇవాళ దోహాలో జరిగే డైమండ్ లీగ్ ఫస్ట్ స్టేజ్ పోటీలో బరిలోకి దిగుతున్నారు. చాలాకాలంగా ఊరిస్తున్న 90మీ. దూరాన్నీ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అతడి ఉత్తమ ప్రదర్శన 89.94మీ. కాగా డైమండ్ లీగ్‌లో నీరజ్‌కు పీటర్స్(గ్రెనెడా), వాద్లెచ్(చెక్ రిపబ్లిక్), వెబర్(జర్మనీ) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది.

Similar News

News December 26, 2024

NLG: రామానందలో ఉచిత శిక్షణ

image

భూదాన్ పోచంపల్లి మండలంలోని SRTRIలో వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డైరెక్టర్ PSSR లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ, భోజన వసతితో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. జనవరి 2 లోపు అర్హత కలిగిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్స్, జిరాక్స్ సెట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News December 26, 2024

TODAY HEADLINES

image

* ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ
* రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం
* రేపు సీఎం రేవంత్‌తో సినీ ప్రముఖుల భేటీ
* ఘోర విమాన ప్రమాదం.. 42 మంది దుర్మరణం
* జానీ మాస్టర్‌పై పోలీసుల ఛార్జిషీటు
* ఏపీలో సంక్రాంతి సెలవుల్లో మార్పులు
* ఏపీలో ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
* అంబేడ్కర్‌కు క్రెడిట్ దక్కనివ్వని కాంగ్రెస్: మోదీ

News December 26, 2024

రేపు కర్ణాటకకు సీఎం రేవంత్

image

TG: కర్ణాటకలోని బెలగావిలో గురువారం నుంచి జరిగే CWC సమావేశాల్లో పాల్గొనేందుకు CM రేవంత్ వెళ్లనున్నారు. ఉదయం 11 తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఆయన బెలగావికి పయనమవుతారు. వందేళ్ల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీజీ బెలగావిలోనే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ‘సత్యాగ్రహ బైఠక్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. గురు, శుక్రవారాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి.