News May 10, 2024
తగ్గేదే లే.. ఓటుకి రూ.2వేల నుంచి రూ.3వేలు!

AP: ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుండగా తాయిలాల పర్వానికి తెర లేచింది. నగదు పంపిణీకి పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చాలా చోట్ల డబ్బు పంచుతున్నట్లు పత్రికల కథనాలు పేర్కొంటున్నాయి. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకు రూ.2వేల నుంచి రూ.3 వేలు.. ప్రముఖులు, ఉత్కంఠ పోరు నెలకొన్న స్థానాల్లో అంతకంటే ఎక్కువే ఇస్తున్నట్లు సమాచారం.
Similar News
News December 31, 2025
GRSEలో 107 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ &ఇంజినీర్స్ లిమిటెడ్ (<
News December 31, 2025
Happy New Year

భారతదేశం మరో 8.30గంటల్లో 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. కానీ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి ద్వీపం పరిధిలోని క్రిస్టమస్ ఐలాండ్ ఇప్పటికే 2026లోకి వెళ్లిపోయింది. భారత కాలమానం ప్రకారం అక్కడ 3:30pmకు నూతన సంవత్సరం ప్రారంభమైంది. 7500 సగటు జనాభా ఉండే ఈ ద్వీప సమూహం ప్రపంచంలోని అత్యంత రిమోట్ ఐలాండ్స్‌లో ఒకటి. కాసేపట్లో న్యూజిలాండ్ సమీపంలోని కొన్ని ప్రాంతాల్లోనూ న్యూ ఇయర్ మొదలవనుంది.
News December 31, 2025
ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు: ఎంపీ భరత్

AP: వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ ఖండించారు. ఓ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఉంటూ ఎమ్మెల్యే పదవికి తాను జస్టిస్ చేయలేనన్నారు. ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు. ఒకవేళ భరత్ భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తాను విశాఖ ఎంపీ స్థానానికి బరిలో నిలిచేందుకు సిద్ధమని MLA గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


