News May 10, 2024
ప.గో జిల్లాలో భారీగా బంగారం, వెండి సీజ్

ప.గో జిల్లా భీమవరం మండలం లోసరి చెక్‌పోస్ట్ వద్ద ఉదయం రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.1.87 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రెండున్నర కిలోల బంగారం, ఐదున్నర కిలోల వెండిని సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని సీజ్ చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 10, 2026
ప.గో: కోట్లల్లో పందేలు.. ఎందుకంటే!

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
News January 10, 2026
మొగల్తూరు: కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోండి

పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు సరి చూసుకుని కొత్త పాసు పుస్తకాలకు దరఖాస్తు చేసుకోవాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. శనివారం మొగల్తూరు మండలం శేరేపాలెం రెవెన్యూ విలేజ్ కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రైతులను కలిసి జేసీ మాట్లాడారు. పాసు పుస్తకాలలో ఉన్న ఫొటో, పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం, ఆధార్ నంబరు, వంటివి ఏమైనా తప్పిదాలు ఉంటే పరిశీలించుకుని సరి చేయించుకోవాలన్నారు.
News January 10, 2026
పాలకొల్లు ఆసుపత్రికి మహర్దశ

పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆయుర్వేద ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. రూ.12.50 కోట్లతో ఆసుపత్రిని 100 బెడ్లుగా అభివృద్ధి చేశామని, రూ.కోటితో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యూటిఫికేషన్ కోసం మరో రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.


