News May 10, 2024

పోలింగ్ రోజు భారీ వర్ష సూచన

image

TG: రాష్ట్రంలో గత 3 రోజులుగా వాతావరణం చల్లబడటంతో ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు జోరు పెంచారు. అయితే పోలింగ్ జరగనున్న ఈనెల 13న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, MBNR, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పోలింగ్ శాతంపై వర్షాలు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

Similar News

News December 26, 2024

రేవంత్.. మీ పిట్ట బెదిరింపులకు భయపడం: హరీశ్

image

TG: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. హోంమంత్రిగానూ శాంతి భద్రతల నిర్వహణలో రేవంత్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

News December 26, 2024

ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ?

image

AP: జనవరి 1న నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల 31వ తేదీనే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. కాగా ఒకటో తేదీన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలుస్తోంది.

News December 26, 2024

నక్కపల్లికి మరో ఫార్మా సెజ్: సీఎం రమేశ్

image

AP: విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా ఫార్మా సెజ్ ఏర్పాటుకానుందని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. జనవరి 9న ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. సుమారు 1800 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిపై కేంద్రం సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. అలాగే పూడిమడక వద్ద రూ.75వేల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.