News May 10, 2024

మహబూబాబాద్: చింతగడ్డ తండాలో గుప్త నిధుల తవ్వకాలు

image

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం చింతగడ్డ తండాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. తన పొలంలో గుప్తనిధులు ఉన్నాయని, అక్కడ తవ్వకాలు జరపాలని కొంతమంది తనను అడిగారని, తాను నిరాకరించినట్లు రైతు వెంకటేశ్ తెలిపారు. ఈ క్రమంలో గురువారం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా పెద్దగుంత తీసి ఉన్నట్లు గమనించాడు. JCBతో తవ్వకాలు చేపట్టినట్లు గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 7, 2026

WGL: నేటి నుంచి ‘హెచ్‌పీవీ’ టీకాలు

image

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌‌వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

News March 7, 2026

WGL: పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ నుంచి తెలంగాణ అధ్యక్షురాలిగా..!

image

వర్ధన్నపేటకు చెందిన స్వర్ణకు కాంగ్రెస్‌లో 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. స్వర్ణ నియామకంతో ఓరుగల్లు రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి. వర్ధన్నపేట, వరంగల్ తూర్పులో రాజకీయం మరింత వేడెక్కనుంది.

News March 7, 2026

ఆర్టీసీ ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలు: ఆర్ఎం

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు వరంగల్ RM విజయభాను తెలిపారు. హనుమకొండ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.